ఇనుగుర్తిలో రాహుల్ అరెస్ట్ ఖండిస్తూ కాంగ్రెస్ రాస్తారోకో
విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తిలో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కూరెల్లి సతీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. నీట్ ప్రవేశ పరీక్షలో అవకతవకలు, ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. విద్యార్థుల ఆందోళనలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జ్‌కు పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రధాని నివాసం ముందు శాంతియుతంగా నిరసన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ని,కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యులు గుజ్జు నూరి బాబురావు, ఏఎంసి డైరెక్టర్ కొట్టం రాము, కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు చిన్నాల కట్టయ్య, కాలేరు శివాజీ, మురళి, కొనతం ప్రభాకర్, దేవులపల్లి వెంకన్న, సలీం, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.