జర్నలిస్టుల సమస్యలపై 27న ఛలో పార్లమెంట్
విశ్వంభర, హైదరాబాదు : జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద "ఛలో పార్లమెంట్" కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో వారు కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి జర్నలిస్టుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణ, జర్నలిస్టుల రక్షణ చట్టం, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించడం, పాత్రికేయులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవడం వంటి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. 27న జరిగే ధర్నాలో దేశంలోని వివిధ రాష్ట్రాల జర్నలిస్టులు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నాయకులు పాల్గొంటారని, అనంతరం కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంచం శ్రీనివాస్, కె. పాండురంగారావు, పి. అశోక్ కుమార్ గౌడ్, వి. రవికుమార్, నంబి పర్వతాలు పాల్గొన్నారు.