ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి 

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి 

  • విద్యార్థుల ఆందోళనలపై పోలీసు చర్యలను ఖండించిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ(సి)

విశ్వంభర, మహబూబాబాద్ : నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ(సి) నాయకులు డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతపై లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు బానోత్ దేవేందర్ అధ్యక్షతన నిర్వహించిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోకన్నా మాట్లాడుతూ, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలతో అణచివేతకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం లాఠీలతో సమాధానం చెప్పడం రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తుందని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని, ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవిలో కొనసాగడం సమంజసం కాదన్నారు. నైతిక బాధ్యత స్వీకరించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రతి ఏడాది కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు వివరించాలని కోరారు. ఇదే అంశంపై కేసముద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంసీపీఐ(సి) జిల్లా కార్యదర్శి మరిపెళ్లి మొగిలి, జిల్లా కమిటీ సభ్యుడు జాటోత్ బిచ్యా నాయక్ మాట్లాడుతూ, ఎన్టీఏ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలని కోరారు. విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం దెబ్బతినకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం పెంచాలని నాయకులు పేర్కొన్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే విద్యార్థి, ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశాల్లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వంగూరు వెంకన్న, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు గోనె భాగ్యలక్ష్మి, జిల్లా నాయకురాలు అనురాధ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు పశువులేటి సాంబయ్యతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dharmendra-pradhan-should-resign/article-19407

Tags: