మహేశ్వరం కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మల్లేష్ యాదవ్

విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాన్సన్‌పల్లి మాజీ సర్పంచ్ వట్టేలా మల్లేష్ యాదవ్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన టీపీసీసీ అధ్యక్షుడు పి. మహేశ్ కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.  నూతన అధ్యక్షుడిని కాంగ్రెస్ నాయకులు అభినందించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, బీసీ సెల్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mallesh-yadav-as-president-of-maheshwaram-congress-mandal/article-19458

Tags: