10న విద్యారంగ సమస్యల పరిష్కారానికి  రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌

:  ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు

విశ్వంభర, గుండాల : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ గుండాల మండల అధ్యక్షులు ధార సతీష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే కుదించే ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని వెంటనే నియమించాలని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి, అక్షయపాత్ర, ఇస్కాన్, మన్నా వంటి సంస్థలకు కాకుండా మహిళా సంఘాల ద్వారానే అమలు చేయాలని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో నంబర్లు 7, 8, 9లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు జూలై 10న జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు అన్నెపర్తి ఉదయ్, పందుల ప్రేమ్ కుమార్, అన్నెపర్తి పరమేష్ పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bandh-of-educational-institutions-across-the-state-to-solve-the/article-18306

Tags: