హుస్నాబాద్‌లో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన
- హుస్నాబాద్‌లో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలో బుధవారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పర్యటించి రెండు కీలక అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు విద్యార్థుల వసతి కోసం హుస్నాబాద్ పట్టణంలోని 20వ వార్డులో గల రైతు బజార్ భవనంలో కేటాయించిన మొదటి, రెండవ అంతస్తులను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, మరుగుదొడ్లు, తాగునీరు, భోజన సదుపాయాలు తదితర అన్ని సౌకర్యాలను శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంతో సమన్వయం చేసుకుని సక్రమంగా కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం నేడు హుస్నాబాద్ ఐఓసీలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వానకాలం–2026 ఎల్‌నినో ప్రభావంపై హుస్నాబాద్ నియోజకవర్గ 7 మండలాల సమీక్ష సమావేశం కోసం జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సమావేశానికి మూడు జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యానవన, గ్రామపంచాయతీ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, విద్యుత్ తదితర శాఖల అధికారులు హాజరవుతారని పేర్కొంటూ, యాక్షన్ ప్లాన్ ప్రజెంటేషన్ కోసం ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని, జిల్లాల వారీగా సీటింగ్ ఏర్పాటు చేయాలని, తాగునీరు, నిరంతర విద్యుత్, మైక్ వ్యవస్థ, ఫర్నిచర్, టీ-స్నాక్స్, మధ్యాహ్న భోజనం వంటి ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆర్డీఓ రామ్మూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ వి.రామ్మూర్తి, తహసీల్దార్, శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.