మున్నూరు కాపు చలో వేములవాడ

మున్నూరు కాపు చలో వేములవాడ

విశ్వంభర, చంద్రాయన గుట్ట : చలో వేములవాడ మున్నూరు కాపుల కథన  బేరికి బయలుదేరిన గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ ఆకుల శ్రీనివాస్ పటేల్ బృందం.... అనంతరం ఆకుల శ్రీనివాస్ పటేల్ షామీర్ పేట్ కట్ట మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుండి వేములవాడ బద్ది మైసమ్మఆలయానికి బయలుదేరారు, ఆకుల శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణలో మున్నూరు కాపు ఐక్యత ఏ విధంగా ఉంది అని చాటి చెప్పడానికి  300 కార్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో వేములవాడ బద్ది మైసమ్మ బోనాల కార్యక్రమానికి ప్రత్యేకంగా బయలుదేరుతున్నామన్నారు.  రాష్ట్రంలో మున్నూరు కాపుల సంఖ్య తక్కువగా చూపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి కులగణలో మున్నూరు కాపుల సంఖ్య తేల్చవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కావున రాబోయే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి మరియు భారతదేశానికి మున్నూరు కాపుల యొక్క పాత్ర రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో సామాజికo గా,రాజకీయంగా, ఆర్థికంగా మున్నూరు కాపుల పాత్ర ఎంతైనా ఉందని తెలుసుకోవాలన్నారు. దీనిని పరిగణలో కి తీసుకొని రాష్ట్ర కేంద్ర రాజకీయాలలో సముచిత స్థానం కల్పించాలన్నారు. కల్వకుర్తి అధ్యక్షులు  చక్రపాణి పటేల్,ఇబ్రహీంపట్నం అధ్యక్షులు రాజశేఖర్ పటేల్,అల్వాల్ అధ్యక్షులు అంజయ్య పటేల్,కమటం శ్రీనివాస్  పటేల్, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు మహిళా నాయకురాలు, నాయకులు తదితరులు భారీగా బయలుదేరారు.

Tags: