రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
On
విశ్వంభర, నెల్లికుదురు: ఆరుగాలం కష్టించి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ అన్నారు. నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండాలో నెల్లికుదురు పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ అశోక్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, బోనస్, రైతు భరోస, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వం అన్నదాతల పక్షాన నిలబడుతోందన్నారు. దళారీల వ్యవస్థను నివారించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు తమ ధాన్యానికి కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈవో బందారపు యాదగిరి, వార్డు సభ్యులు , నాయకులు రమేష్ నాయక్, రైతులు పాల్గొన్నారు.



