కేసీఆర్ కున్న చిత్తశుద్ధికి తీర్పు నిదర్శనం
On
:బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్
విశ్వంభర, పరిగి: దోమ మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ గౌడ్ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో అవకతవకలు జరిగినాయనేది ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయ ప్రేరేపిత అభియోగాలని రుజువైందన్నారు. కేసీఆర్ మీద కమిషన్ పేరుతో వేసిన ప్రభుత్వ ఎత్తుగడ హై కోర్టు ముందు విరీగిపోయిందని అన్నారు. జస్టిస్ పి సి ఘోష్ కమిషన్, కేసీఆర్ కాళేశ్వరం విచారణ పేరుతో వ్యవహరించిన తీరు, ప్రాథమిక న్యాయ సూత్రాలకు, రాజ్యాంగపర హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రాజిరెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, మైనుద్దీన్, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



