హనీ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన  నరేంద్రరెడ్డి వైసీపీ నేతే

హనీ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన  నరేంద్రరెడ్డి వైసీపీ నేతే

అనంతపురం, విశ్వంభర: హనీ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన నరేంద్రరెడ్డి వైసీపీ నేత కాకపోతే ఆ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదో సమాధానం చెప్పాలని అనంతపురం నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, నగర ప్రధాన కార్యదర్శి ఫిరోజ్, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ అర్బన్ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా జిల్లాలో సంచలనం రేపుతున్న హనీ ట్రాప్ లో పట్టుబడిలో రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్ నరేంద్రరెడ్డి ఉన్నారన్న వార్తలు వచ్చాయి. నరేంద్రరెడ్డి వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నరేంద్రరెడ్డి ఎమ్మెల్యే దగ్గుపాటికి దగ్గరగా ఉన్నాడంటూ సాక్షి పత్రిక రాయడం, అలాగే వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల మీద అర్బన్ టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ, నరేంద్రరెడ్డి ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి దగ్గర బంధవుని.. మామ అని పిలించేంత చనువు ఉన్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఆయన్ని నాలుగేళ్ల  క్రితమే పక్కన పెట్టి ఉంటే.. మీ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదో చెప్పాలన్నారు. గత ఎన్నికల్లో కూడా వైసీపీ తరుఫున ప్రచారం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ రోజు హనీ ట్రాప్ లో పట్టుబడ్డాడని తెలియగానే టీడీపీ వ్యక్తి ఎలా అయ్యారన్నారు. మాజీ మేయర్ వసీం పదవి పోయినప్పటి నుంచి మతి భ్రమించి మాట్లాడుతున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తీరు నచ్చక ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి వద్దకు ఎంతో మంది వైసీపీ నేతలు వచ్చారన్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధిని కూడా స్వాగతించారన్నారు. ఈక్రమంలో నరేంద్ర రెడ్డి కలిసి ఫోటో తీయించుకుంటే.. అతను టీడీపీ మనిషి అవుతాడా అని ప్రశ్నించారు. నరేంద్ర రెడ్డి జగన్ రెడ్డి మొదలుకొని రోజా, మిథున్ రెడ్డితో పాటు అనేక మంది వద్ద దిగిన ఫోటోలు చూపించమంటారా నిలదీశారు. అధికారపార్టీతో పాటు ఎమ్మెల్యే దగ్గుపాటి పై ఏదో ఒక అంశంలో బురదజల్లాలని మొదటి నుంచి వైసీపీ బ్యాచ్ ప్రయత్నిస్తోందన్నారు. హనీ ట్రాప్ వ్యవహారంలో పోలీసులు ఎంతో సీరియస్ గా పని చేస్తూ నిందితుల్ని అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఇందులో ఎవరున్నా వదిలే ప్రసక్తి ఉండదన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు తీసుకుంటున్న చర్యల్ని స్వాగతించాల్సింది పోయి.. పార్టీల రంగు పులమడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ నేతలు హితవు పలికారు

Tags: