ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సర్పంచ్ గర్దాస్ విక్రమ్ సంఘీభావం
On
విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ రక్షణ కోసం, సమస్యల సాధనకై చేస్తున్న సమ్మెకు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్ తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ తరుపున ఆయన పూర్తి మద్దతు తెలిపారు. అధికార దాహంతో, అబద్ధాలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ రక్షణ, సమస్యల పరిష్కారాల కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, తమ హక్కులు పోరాడి సాధించుకోవాలన్నారు. మరణించిన ఆర్టీసీ కార్మికుడు కోలా శంకర్ గౌడ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు



