వాసవి మాత జయంతిని అధికారికంగా ప్రకటించడం హర్షణీయం
On
: జిల్లా ఆర్యవైశ్య మహాసభ కన్వీనర్ బాదం శ్రీనివాస్ గుప్తా
విశ్వంభర, పరిగి: ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ఎంతో హర్షణీయమైన విషయమని వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కన్వీనర్ బాదం శ్రీనివాస్ గుప్త అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని అధికారంలోకి రాగానే ఏర్పాటు చేశారని అదేవిధంగా శ్రీ వాసవి మాత జయంతిని ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించేందుకు అధికారికంగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అందుకు సహకరించి, ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తున్న పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టీ. రామ్మోహన్ రెడ్డికి రాష్ట్ర ఆర్యవైశ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైశ్యులకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.



