కులాస్ పూర్ లో దొంగల బీభత్సం - పోలీసుల రక్షణ కరువు - ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసుల వైఫల్యం

కులాస్ పూర్ లో దొంగల బీభత్సం - పోలీసుల రక్షణ కరువు - ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసుల వైఫల్యం

  • 11 ఇల్లు చోరీ పోలీసులకు సవాల్
  • గతంలో సిర్పూర్ లో దొంగతనం 
  • వరుస దొంగతనాలతో ప్రజలు  బెంబేలు
  • పోలీసుల రక్షణ కరువు

విశ్వంభర, నిజామాబాద్ జిల్లా: మోపాల్ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు..బుధవారం రాత్రి ఏకంగా తాళం వేసి ఉన్న 11 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముఠా సభ్యులు రాత్రి పదిమంది తో  చోరీలు చేశారు. సుమారు 5 తులాల బంగారం.. రూ. 2లక్షల 85వేలు నగదు చోరీకి గురైనట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.గ్రామాన్ని ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి సందర్శించారు. మోపాల్ SI సుస్మిత  జూలై 6 న ఛార్జ్ తీసుకున్నరు. చార్జ్ తీసుకున్న  20 రోజుల వ్యవధిలో రెండు భారీ దొంగతనాలు  పోలీసులు గ్రామాలలో నేరాల పట్ల అవగాహన కల్పించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళలో  పెట్రోలింగ్ నిర్వహించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో భయాందోళనలకు గురైతున్న ప్రజలు. పెట్రోలింగ్ సరిగ్గా నిర్వహించకపోవడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు అని ఆరోపిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేయడంలో మోపాల్ పోలీసులు వైఫల్యం. సామాన్యుడి న్యాయం కోసం వెళితే భయభ్రాంతులకు గురిచేసి  బెదిరింపులకు పాల్పడుతున్న పోలీసులు సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే జనుకుతున్నారు. ఉన్నత అధికారుల పరిరక్షణ కరువు తోనే అధికారులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయంతో పోలీస్ స్టేషన్లో పంచాయతీలు. చేస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు.WhatsApp Image 2025-07-25 at 3.03.07 PM

 

Read More అక్రమంగా మట్టి తరలింపు 

 

Tags: