విద్యార్థి దశలోనే సేవా  భావాన్ని అలవర్చుకోవాలి

విద్యార్థి దశలోనే సేవా  భావాన్ని అలవర్చుకోవాలి

విశ్వంభర, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహదేపూర్ ఎన్ ఎస్ ఎస్  జాతీయ సేవా పథకంలో భాగంగ కాళేశ్వర గ్రామ పంచాయతీ పరిధిలో ఏడు రోజుల క్యాంపు కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్,ఇ  మాధవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ జన్ను విజయకుమార్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి  కాళేశ్వర గ్రామ ఉపసర్పంచ్ సుధీర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ,  విద్యార్థి దశనుండే సామాజిక స్పృహ అలవర్చుకోవాలని క్రమశిక్షణ నైతిక విలువలు పెంపొందించుకోవాలని సామాజిక బాధ్యతలు కలిగి పెద్దవాళ్ళను గౌరవించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అపరిశుభ్రత వలన కలిగే నష్టాలను ప్రజలందరికీ తెలియజేయాలని ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్ధాల గురించి అందరికీ అవగాహన కలిగిస్తూ ప్రజలందరినీ చైతన్య పరచాలని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సూచించారు. అదేవిధంగా కాలేశ్వర గ్రామ వార్డు సభ్యులు రేవల్లి రాకేష్, ఇమ్రాన్,రాజశేఖర్ లు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కాలేశ్వర గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కు అభినందనలు తెలియజేస్తూ వాలంటీర్లకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జన్ను విజయకుమార్ కార్యక్రమ అనంతరం అతిధులను శాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: