తెలంగాణలో మారనున్న రెండు జిల్లాల పేర్లు.. సీఎం క్లారిటీ
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో చాలా మార్పులు వచ్చాయి. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న 10 జిల్లాలను పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం 33 జిల్లాలుగా మార్చింది. కొత్త జిల్లాలకు ప్రముఖులు, చారిత్ర నేపథ్యం ఉన్న ప్రాంతాల పేర్లను పెట్టారు. అయితే.. ఈ విషయంలో గత ప్రభుత్వం పక్షపాతం వహించిందని విపక్షాలు ఆరోపించాయి. చాలా మంది గొప్ప నాయకుల కేసీఆర్ ఖాతరు చేయాలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ రెండు జిల్లాల పేర్లను మార్చి.. ఇద్దరి దివంగత నాయకుల పేర్లను పెట్టాలని భావిస్తోంది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి చాలా సార్లు ఈ ప్రస్తావన తీసుకొని వచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. పాపన్న సేవలు భవిష్యత్ తరాలకు తెలిసేలా చేస్తామని అన్నారు. ఇందులో భాగంగా జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టేందుకే పరిశీలిస్తున్నారు.
ఇక.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాకు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఈ పేరు ఖాయం అయినట్టేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా గోండు వీరుడు కొమురం భీం పేరు, ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరు, ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం పేరును, ప్రముఖ శక్తిపీఠం జోగులాంబ పేరు, మరో పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం యాదాద్రి పేర్లను జిల్లాల పేర్లగా పెట్టారు.