అట్టహాసంగా కంగారూ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ 4 వ వార్షికోత్సవం.. డైరెక్టర్ నక్క శ్రీరామ్ యాదవ్ వెల్లడి
విశ్వంభర, హానుమకొండ:- అడ్వకేట్స్ కాలనీలో పేరు ప్రఖ్యాతులు గాంచిన చిన్న పిల్లల విద్యా సంస్థ కంగారూ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ 4 వ వార్షికోత్సవాన్ని హానుమకొండ లోని అంబేద్కర్ భవనంలో అట్టహాసంగా ఆదివారం నిర్వహించినట్లు కంగారు ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్డైరెక్టర్ నక్క శ్రీరామ్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూతురు గోదారెడ్డి,అల్లుడు విష్ణురెడ్డి హాజరయ్యారని తెలిపారు.ఈ సందర్భంగా విష్ణురెడ్డి తల్లిదండ్రుల నుద్దేశించి మాట్లాడుతూ కంగారూ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్లో విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీతో పాఠశాల యాజమాన్యం సరియైన ప్రణాళికలతో విద్యార్థులకు క్రమశిక్షణతో మంచి విద్యాబోధన చేస్తున్నట్లు తెలిపారు.తన కూతురు కూడా ఈ స్కూల్లో చదువుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా విష్ణురెడ్డి పాఠశాల యాజమాన్యంను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నక్క నిహారిక అధ్యాపకులు,సిబ్బంది,తల్లిదండ్రులు పాల్గొన్నారు.



