అందుబాటులో ఉండని అధికారి
•మండలంలో వ్యవసాయ అధికారి జాడ లేకపాయే
•నెలల తరబడి సెలవుల్లో ఉంటున్న వైనం
•రైతులకు అవగాహనా కార్యక్రమాలు శూన్యం
•ఎరువుల కొనుగోలులో రైతులు అయోమయం
విశ్వoభర, అనంతగిరి: వ్యవసాయ అధికారి భాధ్యత ఎప్పటికప్పుడు రైతు వేదికల్లో విస్తరణ అధికారులను అప్రమత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు రైతులకు సాగు విషయాల్లో అవగాహన కల్పిస్తూ ఉండాలి. మండలంలో మాత్రం వ్యవసాయ అధికారి అందుబాటులో లేని పరిస్తితి నెలకొంది. అనారోగ్య కారణాల దృష్ట్యా కొద్దిరోజుల వరకు విశ్రాంతి తీసుకోవడం అధికారులకు సహజం. కానీ ఆ అధికారి నెలల తరబడి సెలవుల్లో ఉండడం లేదా రైతులకు అందుబాటులో లేకపోవడం ఇలా ఆ అధికారి నిర్లక్ష్యం మూలంగా రైతులకు యూరియా ఇబ్బందులు తలెత్తడంతో పాటు రైతు భరోసా ఫార్మర్ రిజిస్ట్రేషన్ వంటి అనేక సేవల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా యూరియా యాప్ ద్వారా ఉపయోగాలను గ్రామాల వారీగా రైతులకు అవగాహన కల్పించకపోవడంతో యూరియా యాప్ ఉపయోగం తెలియని రైతులకు సకాలంలో యూరియా సరఫరా కాక పంట నష్టం భారీగానే వాటిల్లందని రైతులు రోడ్లెక్కి వ్యవసాయ అధికారికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసిన సంఘటనలు కూడా మండల వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. అంతే కాక పంట నమో



