పద్మశాలి కుటుంబాన్ని అదుకున్న కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు - -హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు

పద్మశాలి కుటుంబాన్ని అదుకున్న కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు - -హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు

విశ్వంభర, హైదరాబాదు : గత నెల జనవరి 26న నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన భరతమాత మహా హారతి లో హుస్సేన్ సాగర్ లో పడవలో బాణాసంచా పేలి నాగారంకు చెందిన చెరుపల్లి అజయ్ అనే పద్మశాలి బిడ్డ మరణించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు ఆధ్వర్యం లో కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి తో  మాట్లాడి  ఆ పేద బిడ్డ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా 20 లక్షల రూపాయలను చెక్కు రూపంలో,  వారి కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇప్పియడం జరిగింది. కృతజ్ఞతగా హైదరాబాద్ పద్మశాలి  సంఘం తరపున సంఘం అధ్యక్షుడు  కత్తుల సుదర్శన్ రావు  కలిసి కిషన్ రెడ్డి కి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి  సంఘం  ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత,  కోశాధికారి ఎనగందుల అంజయ్య , మాజీ కార్పొరేటర్ వనం రమేష్ , అఖిలభారత పురోహిత సంఘం అధ్యక్షులు గుర్రం బొజ్జయ్య , అఖిల భారత పద్మశాలి సంఘం కార్యదర్శి రచ్చ నాగరాజు  జాతీయ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు  చిక్కా దేవదాసు , ఇంజనీర్ విభాగం అధ్యక్షులు పుట్ట పాండురంగయ్య , రహమత్ నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోషిక భాస్కర్  , కార్యదర్శి  జగదీష్   తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement