తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల్లో టెన్షన్.. స్వల్ప ఆధిక్యంలో బీజేపీ

తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల్లో టెన్షన్.. స్వల్ప ఆధిక్యంలో బీజేపీ

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు తొలి ట్రెండ్స్ విడుదలయ్యాయి. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు తొలి ట్రెండ్స్ విడుదలయ్యాయి. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు అరగంటపాటూ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలో తొలి ఫలితం విడుదలైంది. 

పోస్టల్ బ్యాలెట్లలో స్వల్ప ఆధిక్యంతో బీజేపీ ముందంజలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం తగ్గింది. తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా పేరున్న మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎల్‌బీ నగర్ అసెంబ్లీ సెగ్మెట్‌లో మొదటి రౌండ్‌లో బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. మరోవైపు కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

Read More తెలంగాణ ప్రాంత ఆత్మీయ పండుగ పీర్ల పండుగ - టి ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్  

ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి నగేష్‌ ఆధిక్యంలో ఉన్నారు. అటు హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ముందంజలో ఉన్నారు. నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ముందంజలో ఉన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. తొలుత బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు ముందంజలో కొనసాగారు. మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముందజలో ఉన్నారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. అయితే తొలిరౌండ్‌లో బీఆర్ఎస్‌కు నిరాశ ఎదురైంది.