తెలంగాణ ఐకాన్ కేటిఆర్: బిఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ .
విశ్వంభర, సరూర్ నగర్ : తెలంగాణ రాష్ట్ర యువతకు మాజీ మంత్రి, బిఆర్ ఎస్ కార్యానిర్వాహాక అధ్యక్షులు కేటిఆర్ తెలంగాణ ఐకాన్ అని బిఆర్ ఎస్ మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు. ఆర్ కె పురం డివిజన్ లో గురువారం డివిజన్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ అధ్వర్యంలో కేటిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ శర్మ మాట్లాడుతూ హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి పురపాలక శాఖ మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు విస్తరించడానికి కేటిఆర్ విశేషంగా కృషి చేశారని అని అన్నారు. ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటిఆర్ ప్రపంచంలోనే ప్రముఖ ఐటీ కంపెనీలను తీసుకువచ్చినా ఘనత కేటీఆర్ దే అని అన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి ఆయన చేసిన కృషి చేశారు అన్నారు. బెంగళూరు నగరానికి ధీటుగా హైదరాబాద్ నగరంలో ఐటీ అభివృద్ధి చెందడానికి కేటిఆర్ తీసుకున్న నాటి నిర్ణయాలు భవిష్యత్తు యువత ఉపాధికి దోహదం చేస్తున్నాయని అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, రాష్ట్ర అభివృద్ధిలో కూడ కల్వకుంట్ల తారక రామారావు పాత్ర అత్యంత కీలక పాత్ర పోషించారు అని ఆయన పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో ఆర్ కె పురం డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని అరవింద్ శర్మ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గొడుగు శ్రీనివాస్ , సాజిద్, శ్రీనివాస్ రెడ్డి, రామాచారి, కొండ్రు శ్రీనివాస్, కంచర్ల శేఖర్, పెంబర్తి శ్రీనివాస్, వెంకటేష్ గౌడ్, ముచ్చింతల జగన్, రమేష్ కురుమ, వాజిద్ పటేల్, సంతోష్, శివ నాయక్, నవీన్ గౌడ్, నిరంజన్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.



