తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల..

తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల..

 

తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు విడదల అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల చేశారు. వీటిని హైదరాబాద్ లోని హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజీ వర్సిటీ ఇంఛార్జి విసి నవీన్ మిట్టల్ కలిసి విడుదల చేశారు. 

Read More  కేటీఆర్ వాహనం పై దాడి .. తృటిలో తప్పిన ప్రమాదం 

రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం టీజీ ఎడ్సెట్ ఎగ్జామ్ ను నిర్వహించారు. మే 23న నిర్వహించిన ఎగ్జామ్ కు మొత్తం 33,879 మంది అప్లై చేసుకున్నారు. అయితే ఇందులో 29, 463 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. ఈసారి ఎడ్‌సెట్‌ పరీక్షలను నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ నిర్వహించింది. 

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడీ కాలేజీల్లో మొత్తం 14, 285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 96.90 శాతం మంది తాజా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు.