తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు  ఏర్పాటు చేయాలి

తెలంగాణ ఉద్యమకారుల కు 250 గజాల స్థలం ఇవ్వాలి 

ఉద్యమకారులకు నెలకు 30 వేల గౌరవ వేతనాన్ని ప్రతినెలా ఇవ్వాలి

విశ్వంభర, హైదరాబాదు : బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం  తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం తెలంగాణ ఉద్యమకారుల సమావేశ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఉద్యమకారుల జేఏసీ సెక్రటరీ జనరల్  ప్రఫుల్ రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి ,జేఏసీ గౌరవ అధ్యక్షుడు రంగారెడ్డి లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు  ఏర్పాటు చేసి  ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు.  ఉద్యమంలో పని చేసి లబ్ధి పొందని కళాకారులను సాంస్కృతి సారధిలోని వివిధ పోస్టులలో  అవకాశం ఇవ్వాలని  అన్నారు. ఉచిత బస్సు పాసులు 250 గజాలు ఇంటి స్థలంలో పాటు నాలుగు గదుల ఇల్లు నిర్మించి అందజేయాలని ప్రభుత్వ పథకాలలో ఉద్యమకారులను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు  నాయకులు  సోమన్న యాదగిరి చంద్రన్న ప్రసాద్ మాధవి  జాన్సన్  తదితరులు పాల్గొన్నారుతదితరులు పాల్గొన్నారు.

Tags: