పోలీస్ ప్రజావాణిలో 32 ఫిర్యాదులు
విశ్వంభర, నిజామాబాద్ : పోలీస్ ప్రజావాణిలో భాగంగా 32 ఫిర్యాదుల స్వీకరించారు. ఈ మేరకు సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడిన సీపీ సంబంధిత పోలీసస్టషన్ ఇన్ఛార్జీలకు ఫోన్ ద్వారా మాట్లాడారు. చట్టపరమైన పరిష్కార మార్గం చూపాలని వారిని ఆదేశించారు. ప్రజావాణి అనంతరం సీపీ సాయి చైతన్య. మాట్లాడుతూ, ఫిర్యాదుదారులు నిర్భయంగా ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా ప్రజావాణిలో తనను సంప్రదించవచ్చన్నారు. స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన అన్నారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను పరిష్కరించుకునే మార్గం కల్పించేందుకే ప్రతి సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.



