జన్మదిన వేడుకలకు దూరంగా టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎందుకంటే ?
On
విశ్వంభర,హైదరాబాద్ : ఈనెల 7న టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి , వారి కూతురు జయారెడ్డి పుట్టినరోజు సందర్భముగా, ప్రతీ ఏటా కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆద్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు.
కాని గత వారం సిగాచి పరిశ్రమ లో 39 మంది కార్మికులు దుర్మరణం చెందిన నేపథ్యం లో పుట్టిన రోజు వేడుకల కు దూరంగా ఉండాలని జగ్గారెడ్డి నిర్ణయం తీసుకున్నారు
సంగారెడ్డి జిల్లా లో ప్రమాదం జరగడం, జిల్లా అధికార యంత్రాంగం అంతా సహాయక చర్య ల్లో నిమగ్నమైంది. ఇంకా కొంతమంది ఆచూకీ తెలియడం లేదు. అందువల్ల ప్రస్తుత ఈ విషాద సమయం లో నా పుట్టినరోజు వేడుకలు జరపడం సరైన ది కాదని , కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, నా అభిమానులేవ్వరు నా బర్త్ డే వేడుకలు జరపొద్దని, ఎక్కడా ఫ్లెక్సీ లు పెట్టొద్ద నీ జగ్గారెడ్డి సూచించారు



