నష్టపోయిన చేనేత కార్మికులను ఆదుకోండి.
- చేనేత కార్మిక సంఘం
విశ్వంభర, చండూర్ :- పట్టణ కేంద్రంలో వర్షాల కారణంగా చేనేత మగ్గం గుంటల్లో కి వర్షపు నీరు ప్రవేశించి, చీరలు, నూలు మరియు నేయడానికి ఉపయోగించే సామాగ్రి పూర్తిగా నష్టపోయాయి. అనేక మంది చేనేత వృత్తిదారులు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి వలన వృత్తిదారులు పనిని కొనసాగించలేని స్థితికి చేరుకున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి, చేనేత వృత్తిదారులకు అవసరమైన సహాయం చేయాలని సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ ప్రభావిత ప్రాంత అంగడిపేట రాజీవ్ కాలనీ లో సందర్శించి చేనేత వృత్తిదారుల పరిస్థితిని రాష్ట్ర కార్యదర్శి మూషం నరహరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి వెంకటేశం పరిశీలించారు. నష్టపోయిన చేనేత కార్మికులను చండూరు చేనేత కార్మిక సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. వీటికి వెంటనే నష్టపరిహారం మరియు ఆర్థిక సహాయం అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు చేనేత కార్మిక సంఘం నాయకులు, అధ్యక్షులు,రాపోలు వెంకటేశం, ఉపాధ్యక్షులు – బొల్ల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.



