శివరాత్రికి ముస్తాబైన శ్రీ కాశీ విశ్వేశ్వర శివలింగం

ఆలయ ధర్మకర్త బొమ్మకు బాలయ్య

శివరాత్రికి ముస్తాబైన శ్రీ కాశీ విశ్వేశ్వర శివలింగం

విశ్వంభర, బోడుప్పల్: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పదవ డివిజన్ మాజీ కార్పొరేటరబొమ్మకు సుగుణ బాలయ్య, ఆలయ ధర్మకర్త బొమ్మకు బాలయ్య ఆధ్వర్యంలో ఈదయ్య నగర్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర శివాలయం లో మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని దేవాలయం సర్వదా సిద్ధమైందని, రంగురంగుల పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించామని, ప్రతి ఏటా శివరాత్రిని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. అదేవిధంగా ఈనెల 26 బుధవారం మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని, ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై సాయంకాలం ఏడు గంటలకు బిల్వార్చన నిర్వహించి శివారాధన పూర్తి చేయడం జరుగుతుందని బాలయ్య తెలిపారు. అంతేకాకుండా మహాశివరాత్రి ని పురస్కరించుకొని రుద్రాభిషేకం, అభిషేకము, ప్రత్యేక బిల్వార్చన లాంటి ప్రత్యేక పూజలు నిర్వహిండం జరుగుతుందని, డివిజన్లోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఆ పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యనిర్వాహనలో ఈదయ్య నగర్ కాలనీ అసోసియేషన్ మరియు యూత్ సభ్యులు పాల్గొని భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అన్నిపర్యవేక్షణలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

Tags: