సునీత మాగంటి భార్య కాదు.. ప్రద్యుమ్న సంచలన ఆరోపణలు ..!
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సంచలన ట్విస్ట్..!
On
విశ్వంభర, హైదరాబాద్ :-జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాగంటిపై తీవ్రమైన ఆరోపణలు వెలువడుతున్నాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏకైక చట్టబద్ధమైన కుమారుడిగా చెప్పుకుంటున్న తారక్ ప్రధుమ్న కోసరాజు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సునీత తప్పుడు సమాచారం ఇచ్చారని.. చాలా విషయాలను దాచిపెట్టారని ఆయన లేఖలో ఆరోపించారు. "గోపీనాథ్ 1998 ఏప్రిల్ 29న కోసరాజు మాలిని దేవిని చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఆయన మరణం వరకు కొనసాగింది. డివోర్స్ జరగలేదు. నేను వారి ఏకైక చట్టబద్ధ కుమారుడిని. అయితే సునీత మాగంటి గోపీనాథ్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారు. ఆమెను ఆయన చట్టబద్ధ భార్యగా.. తన పిల్లలను చట్టబద్ధ వారసులుగా తప్పుగా చూపారని ఆరోపణ. ఎన్నికల అఫిడవిట్‌లో కూడా ఇలా తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 125ఏను ఉల్లంఘించినట్టు అవుతుంది." అంటూ తారక్ ప్రధుమ్న లేఖలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు మద్దతుగా రాజేంద్రనగర్ డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్‌డీఓ) 2025 అక్టోబర్ 11న జారీ చేసిన ఆర్డర్‌ను (రిఫరెన్స్ నెం.సి/2100/2025) ఆయన జతచేశారు. ఈ ఆర్డర్‌లో సునీత తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందారని.. గోపీనాథ్ మొదటి వివాహ విషయాలను దాచిపెట్టారని అన్నారు. దీంతో ఆ సర్టిఫికెట్‌ను (నెం. సి/08/2025-262, తేదీ 04.07.2025) రద్దు చేశారరని.. సునీత గోపీనాథ్ చట్టబద్ధ భార్య కాదని ఆర్‌డీఓ ధృవీకరించారని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న తారక్ ప్రధుమ్న.. ఎన్నికల కమిషన్‌కు ఈ లేఖలో అఫిడవిట్ ధృవీకరణ చేయాలని కోరారు. తప్పుడు సమాచారానికి చర్యలు తీసుకోవాలని, అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలన్నారు. అవసరమైతే తాను హైదరాబాద్‌కు వచ్చి సహకరిస్తానని చెప్పారు. ఆర్‌డీఓ ఆర్డర్, తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికెట్, తల్లిదండ్రుల వివాహ ఫోటోలు (1998), తన బర్త్ సర్టిఫికెట్ లేఖకు జత చేశారు. అయితే ఈ ఆరోపణలపై మాగంటి సునీత వైపు నుంచి ఇంకా స్పందన రాలేదు. ఎన్నికల కమిషన్ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇటీవలి ఎన్నికలలో సునీత ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఓటర్ జాబితాలో మోసాల ఆరోపణలపై కోర్టుకు వెళ్లారు. జూబ్లీహిల్స్ నామినేషన్ల స్క్రూటీని కొనసాగుతున్న వేళ ఈ ఆరోపణలు సంచలనం రేకిత్తిస్తున్నాయి.



