మండల కేంద్రంలో విత్తన మేళా
విశ్వంభర, రామన్నపేట: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని మెట్ట (వర్షాధార) పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల వ్యవసాయ అధికారి ఎజాజ్ అలీఖాన్ తెలియజేశారు. సోమవారం రోజు రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విత్తన మేళా కార్యక్రమాన్ని పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, రామన్నపేట ఉప-సర్పంచ్ మోటె రమేష్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎజాజ్ అలీఖాన్ మాట్లాడుతూ, రైతులు అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా స్థానిక పరిస్థితులకు అనుకూలమైన వర్షాధార పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని, రైతుల సౌకర్యార్థం అవసరమైన మెట్ట పంటల విత్తనాలను సంబంధిత రైతు వేదికలలో అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల బిక్షంరెడ్డి మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల వలన రైతులు స్వల్ప కాలికంగా పండే కందులు, మినుములు కూరగాయలను సాగు చేయాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సకాలంలో విత్తనాలను పొందడంతో పాటు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ పంటల సాగు చేపట్టాలని కోరుతున్నామని, అధిక సమాచారం కోసం సమీప వ్యవసాయ అధికారి లేదా రైతు వేదికను సంప్రదించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జమీరొద్దీన్, వనం చంద్రశేఖర్, నాసర్, నోముల ప్రవీణ్ కుమార్, రైతులు ఉప్పలయ్య, యాదాసు రాములు, యాదమ్మ, సరిత నరసింహ, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం.శ్రీనివాస్, పి.శ్రీనివాస్, వి.కీర్తన, ఈ.లావణ్య తదితరులు పాల్గొన్నారు.