ఆర్మూర్‌లో బీసీ బాలుర హాస్టల్ ఏర్పాటుకు పరిపాలనా ప్రతిపాదనలు
- 200 మంది విద్యార్థుల సామర్థ్యంతో కొత్త హాస్టల్‌కు ప్రతిపాదన
విశ్వంభర, నిజామాబాద్ : ఆర్మూర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ (హాస్టల్-బి) ఏర్పాటుకు పరిపాలనా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు వినయ్ రెడ్డి చొరవతో పాటు సంబంధిత అధికారులతో సమన్వయం ఫలితంగా ఈ ప్రతిపాదనలు ముందుకు వచ్చినట్లు తెలిసింది. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌కు పంపిన ప్రతిపాదనల్లో, ప్రస్తుతం పెర్కిట్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌ను రెండు హాస్టళ్లుగా విభజించి, ఆర్మూర్‌లో 200 మంది విద్యార్థుల సామర్థ్యంతో కొత్త బీసీ బాలుర హాస్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. హాస్టల్ ప్రారంభానికి అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది వేతనాల కోసం రూ.8,56,960 మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ హాస్టల్ ఏర్పాటుతో ఆర్మూర్‌తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన బీసీ విద్యార్థులకు నాణ్యమైన వసతి, విద్యా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ, హాస్టల్ ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. హాస్టల్ ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.