ప్రజావాణి ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

  • జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

విశ్వంభర, మహబూబాబాద్:   ప్రజావాణిలో వచ్చిన ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, జిల్లాలోని అన్ని విభాగాల ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ అమలుకు యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలన్నారు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో . అదనపు కలెక్టర్ రెవెన్యు కె.అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి పురుషోత్తం, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డి.ఆర్.ఓ నాగలక్ష్మి, ట్రైనీ డిప్యుటీ కలెక్టర్ నితీష్ కుమార్ ల తొ కలిసి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సంది మహబూబ్ రెడ్డి తనకు ఉన్న  భూమిలో గల సర్వే నెంబర్ లో  ఈ మధ్య జరిగిన భూబారతి డిజిటల్ సర్వే లో తొమ్మిది గుంటలు తక్కువగా చూపిస్తుందని, అట్టి భూమి సర్వేయర్ ద్వారా తిరిగి సర్వే చేపించి సరిచేసి ఇవ్వగలరని కోరారు. మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీ కి చెందిన శ్రీ రామ మౌనిక తాము నిరుపేద కుటుంబానికి చెందిన వారమని, ఇందిరమ్మ ఇల్లు మొదటి జాబితాలో ఇల్లు మంజూరు అయింది కానీ రేషన్ కార్డు లేక పోవడంతో ఇందిరమ్మ ఇవ్వడానికి నిరాకరించారని రెండవ విడతలో నైనా ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. సీరోలు మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన రుద్ర భాస్కర్ తన పాత పాస్ బుక్ లోని పట్టా భూమి ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాస్ బుక్ నమోదుకు వచ్చే సరికి మొత్తం భూమి రికార్డు కాలేదని కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగిన సమస్యకు పరిష్కారం అవట్లేదని దయచేసి తన సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజవాణిలో (184) దరఖాస్తులు వచ్చిన వినతులను వివిధ శాఖల అధికారులకు పరిష్కారం కొరకు ఆదేశించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని విభాగాల వారు ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాలు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు శాఖలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలని తద్వారా నిర్దిష్టమైన వేగమైన పనులు జరుగుతాయని అట్టి నివేదికలను ప్రతి తనకు సమర్పించాలని కలెక్టర్ సంబంధిత విభాగాలను ఆదేశించారు, ముఖ్యమంత్రి గ్రీవెన్స్, జిల్లా గ్రీవెన్స్ లపై శాకలవారీగా సమీక్ష సమావేశం నిర్వహించి దరఖాస్తుదారులకు వెంటనే లిఖితపూర్వకంగా సమాధానాలు పరిష్కారాలు చూపాలని, జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, వారు క్షేత్రస్థాయిలో పిల్లలతో కలిసి భోజనం చేసి వసతి గృహం లోని సౌకర్యాలను తనిఖీ చేయాలని అట్టి నివేదికను వెంటనే తమకు అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/public-broadcasting-applications-should-be-dealt-with-expeditiously/article-19927

Tags: