భవిష్యత్తు తరాల మనుగడ కోసం పంట మార్పిడి తప్పనిసరి

  • ప్రాజెక్ట్ వైవిధ్యం'కు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మురళి నాయక్, కలెక్టర్ స్నేహ శబరిష్

విశ్వంభర, మహబూబాబాద్ : భవిష్యత్తు తరాల ఆరోగ్యం, భూసార పరిరక్షణ, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పంట మార్పిడి విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పిలుపునిచ్చారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం, తగ్గుతున్న వర్షపాతం నేపథ్యంలో రైతులు వరిపై ఆధారపడకుండా ఆరుతడి పంటలు, కూరగాయలు, చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. సోమవారం మహబూబాబాద్ పట్టణంలోని ఏటిగడ్డ తండా రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళాను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో 'ప్రాజెక్ట్ వైవిధ్యం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, వివిధ కంపెనీల విత్తనాల స్టాళ్లను సందర్శించారు. రైతులతో మాట్లాడి ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనువైన విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, ఎస్సారెస్పీతో పాటు ఇతర నీటి వనరులు కూడా పరిమితంగా ఉండటంతో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేస్తే రైతులకు అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రతి రైతు తన భూమిలో సాధ్యమైనంత వరకు పంట కుంట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తాను కూడా తన వ్యవసాయ క్షేత్రంలో పంట కుంట ఏర్పాటు చేసి కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ రైతులు ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరి, పత్తి, మిరప, మొక్కజొన్న వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా పెసర్లు, వేరుశనగ, చిరుధాన్యాలు, నూనెగింజలు, ఆయిల్ పామ్, మునగ, కూరగాయలు, పండ్లు, పూల సాగు చేపట్టాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా భూసారం పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. అధికంగా వరి సాగు చేయడం వల్ల భూసారం తగ్గడం, యూరియా వినియోగం పెరగడం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పసుపు, వేరుశనగ వంటి పంటల సాగు తగ్గిపోవడంతో వాటిపై ఆధారపడిన పరిశ్రమలు కూడా దెబ్బతింటున్నాయని చెప్పారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. జిల్లాలో సుమారు రెండు లక్షల మంది రైతులు ఉన్నారని, వారు డిమాండ్‌కు అనుగుణంగా పంటలను సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చన్నారు. విబిజి రామ్‌జీ పథకం కింద ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులు పంట కుంటలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు మునగ తోటల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న విత్తనాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన రైతులతో పంట మార్పిడి విధానాన్ని పాటిస్తూ ఆరుతడి పంటల సాగుకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి జినుగు మరియన్న, స్థానిక సర్పంచులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/crop-rotation-is-essential-for-the-survival-of-future-generations/article-19925

Tags: