రేపు తెలంగాణలో స్కూల్స్ బంద్

రేపు తెలంగాణలో స్కూల్స్ బంద్



రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 26 న బుధవారం రోజు తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ABVP బందుకు పిలుపునిచ్చింది. తెలంగాణలో అన్ని స్కూల్స్ ల విద్యార్థులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని.. స్కూల్ ప్రారంభం అయి దాదాపు 15 రోజులు అవుతున్నా విద్యార్థులకు పుస్తకాలు కూడా పంపిణీ చేయలేదని ABVP  మండిపడింది. 

Read More మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన సదస్సు

అలాగే  ప్రైవేట్ స్కూల్స్  ఫీజులు బాగా పెంచాయి కాబట్టి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేసింది. స్కూల్ లో అన్ని రకాల వసతులు కల్పించాలని ఇందులో భాగంగానే ప్రతి స్కూల్ మూసివేసి సహకరించాలని  ABVP కోరింది. ఇక బంద్ కు పిలుపునివ్వడంతో కొన్ని విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ఇచ్చేస్తున్నాయి.