ఆర్టీసీ డ్రైవర్ వర్సెస్ మహిళా ప్రయాణికులు.. నడిరోడ్డుపై రచ్చరచ్చ

ఆర్టీసీ డ్రైవర్ వర్సెస్ మహిళా ప్రయాణికులు.. నడిరోడ్డుపై రచ్చరచ్చ

విశ్వంభర, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం  అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం కింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభంలో ఎన్నో విమర్శలకు గురైంది. బస్సుల్లో మహిళలు జుట్లు పట్టుకుని తన్నుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలు ఎన్నో చూశాం. ఆ తర్వాత ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపైనా మహిళా ప్రయాణికులు దాడికి దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవల ఈ కుమ్ములాటలు తగ్గినా.. తాజాగా లక్డీకపూల్‌లో ఆర్టీసీ డ్రైవర్ వర్సెస్ మహిళా ప్రయాణికురాలి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగి బస్సు నడిరోడ్డుపై నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

డిపో నుంచి బయలుదేరిన ఆర్టీసీ సిటీ బస్ లక్డికపూల్‌లో దగ్గరకు రాగానే ఓవర్ లోడ్ అయింది. ఈ క్రమంలో ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని మహిళా ప్రయాణికులను ఎక్కించుకునేందుకు సిటీ ఆర్టీసీ బస్ డ్రైవర్ నిరాకరించాడు. దీంతో ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురైంది. నన్ను ఎలా ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై ఫైర్ అయింది. బస్సు నీదా అంటూ డ్రైవర్ పై మండిపడింది. ఎక్కించుకుంటావా లేదా అంటూ బస్సుకు అడ్డం తిరిగింది. దీంతో చేసేది ఏం లేక నడి రోడ్డు పై బస్సు ఆపేసిన డ్రైవర్ అసహానంతో ‘‘నేను బస్సు నడపలేను.. బండి తీసుకొని పో’’ అంటూ నడిరోడ్డుపై బస్సును నిలిపివేసి కిందికి దిగి వెళ్లిపోయాడు. ప్రయాణికులు ఈ వీడియోను సోషల్ మీడియా పెట్టడంతో వైరల్ గా మారింది. 

Read More లక్ష్మీపురంలో కాంగ్రెస్ యాత్ర రాజ్యాంగాన్ని రక్షించుకుందామని పిలుపు..

 

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు