రోశయ్య సేవలు చిరస్మరణీయం

రోశయ్య జయంతిని అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం

రోశయ్య సేవలు చిరస్మరణీయం

 విశ్వంభర, మోత్కూర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయమని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షనీయమని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మొగుళ్లపల్లి సోమయ్య అన్నారు. శుక్రవారం మోత్కూర్ ఆర్యవైశ్య భవనంలో రోశయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయన దక్కించుకున్నారని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చిందన్నారు. వివాద రహితుడుగా పేరుపొందిన రోశయ్య పేరును నేచర్ క్యూర్ ఆసుపత్రికి పెట్టడం సంతోషకర విషయం అన్నారు. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ మాజీ అధ్యక్షులు సోమ వెంకటేశ్వర్లు, బుస్స శ్రీనివాస్, కోశాధికారి బుక్క విశ్వనాథం, ప్రతినిధులు సోమ లింగయ్య, సోమ నర్సయ్య, మిట్టపల్లి నగేష్, గౌరు సత్యనారాయణ, గౌరు శ్రీనివాస్, బుస్స రవి, అనంతుల వెంకటేశ్వర్లు, బండారు రాజేంద్రప్రసాద్, దారం సురేష్, దామేర సోమయ్య, అల్లాడి సోమేశ్వర్, మురారిశెట్టి శ్రీధర్, రాంపాక శంకర్, పందిరి వెంకటేశ్వర్లు, ఇమ్మడి రమేష్, సోమ మనిదీప్, మాశెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.