అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి . - కస్తూర్భా విద్యార్థినులకు ఎమ్మెల్యే భరోసా

62 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన

  • మౌలిక సదుపాయాలు కల్పిస్తా మంచిగా చదువుకోండి
  • రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల  మౌలిక వసతుల అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు

విశ్వంభర,సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని  నారాయణపురం మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా బాలికల పాఠశాలలో 62 లక్షల వ్యయంతో  అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం పాఠశాల మొత్తం పరిశీలించారు. మునుగోడు  శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .. విద్యార్థినుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు, డార్మెటరీ హాల్స్, బాత్రూంలు, టాయిలెట్లు, ప్లే గ్రౌండ్ లాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయా  అని ఆరా తీశారు... పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు... ప్రతి తరగతి గది, డార్మెటరీ హాల్  లను పరిశీలించి... విద్యార్థినుల సంఖ్యాకు సరిపడా  అదనపు తరగతి గదుల నిర్మాణం, నూతన డార్మెటరీ హాల్స్ తో పాటు 12 మంది విద్యార్థినులకు ఒక్కో టాయిలెట్, బాత్రూమ్స్ చొప్పున  ఉండేలా  సరిపడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కస్తూరిబా బాలికల పాఠశాల పరిసరాలని కలియ తిరుగుతూ ప్లే గ్రౌండ్ ఎలా ఉండాలి ఎటువైపు డార్మెటరీ హాల్స్  , అదనపు తరగతి గదులు ఉండాలనే అంశం పై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు..ప్రభుత్వ విభాగానికి చెందిన ఇంజనీర్లు వేసిన ఇంజనీర్ ప్లానను పరిశీలించి.. విద్యార్థునుల భవిష్యత్తు కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేయించి పనులు మొదలు పెడతామన్నారు.ఇప్పటికే తన వ్యక్తిగత ఇంజనీరింగ్ బృందంతో ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరం అనే విషయాలను స్వయంగా తెప్పించుకున్న ఎమ్మెల్యే ఆ వైపుగా అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నామన్నారు...రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల  మౌలిక వ సతుల అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తి లేదన్నా ఆయన ఇప్పటికే మర్రిగూడెం కస్తూరిబాలో 1 కోటి 25 లక్షల రూపాయల సొంత నిధులతో 9 అదనపు తరగతి గదులు, 30 కి పైగా  బాత్రూంలు, టాయిలెట్స్ నిర్మాణం తో పాటు  సరిపడా ఆట స్థలాన్ని  కూడా తయారు చేసి ఇస్తున్నామని గుర్తు చేశారు... మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న  రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాలలో  మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి సాయ శక్తుల కృషి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులతోపాటు కస్తూర్బా సిబ్బంది, సంబంధిత శాఖ ఇంజనీర్ లు  పాల్గొన్నారు.
🕒 07 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/raj-gopal-reddy-mla-komatireddy-raj-gopal-reddy/article-6417

Tags: