మృతుడి కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సాయం
విశ్వంభర, అనంతారం: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారం గ్రామానికి చెందిన అంగడి రాజు అకాల మరణంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన కుటుంబానికి ఎస్ఎంఎస్ గుండాల ఎస్ఎస్సి బ్యాచ్ 2017–18 విద్యార్థులు మానవతా దృక్పథంతో చేయూత అందించారు. అంగడి రాజు కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న బ్యాచ్ విద్యార్థులు పరస్పరం చర్చించి, తమ వంతు బాధ్యతగా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం బ్యాచ్ సభ్యులంతా స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి, మొత్తం రూ.12,500ను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బ్యాచ్ ప్రతినిధులు మాట్లాడుతూ, మా స్నేహితుడి కుటుంబానికి ఈ చిన్న సహాయం కొంతైనా ఊరటనిస్తుందని ఆశిస్తున్నాం, అవసర సమయంలో తోటి స్నేహితులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధార. సతీష్, డి. ప్రశాంత్, అరవింద్, పాల్సన్, రాజు తదితర బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు.