మొక్కలను సంరక్షించడం సామాజిక బాధ్యత

WhatsApp Image 2024-07-20 at 13.32.23_951ab9c4

 విశ్వంభర, ఆమనగల్లు, జూలై 20 : - మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
 వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం అయన ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా లో  సీఐప్రమోద్ కుమార్, ఎంపీడీవో మాధురి, ఎస్సై వెంకటేష్ తో కలిసి మొక్కలు నాటారు

Read More  బుల్లెట్ల వర్షం కురిపించండి

WhatsApp Image 2024-07-20 at 13.32.24_38493957
 అనంతరం కసిరెడ్డి మాట్లాడుతూ  వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ సంవత్సరం 66 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ,మొక్కలు నాటడంతో పాటు నాటిన ప్రతి మొక్క సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా అన్ని స్థలాల్లో, అలాగే రహదారులకు ఇరువైపులా అన్నిచోట్ల మొక్కలు నాటాలని తెలిపారు.WhatsApp Image 2024-07-20 at 13.32.24_3703e6ef
 
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీఅనిత విజయ్. ఆమనగల్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వసుపుల మానయ్య.మండలకాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు జగన్. పసుపుల శ్రీశైలం, మెకానిక్ బాబా,కృష్ణానాయక్.కాలేమల్లయ్య.పర్వతాలు.రాఘవేందర్.ఎంగలి ప్రసాద్.ఖాదర్.శ్రీనివాస్ రెడ్డి.మైసయ్య.సురేష్. తదితరులు పాల్గొన్నారు.