ప్రీ ప్రైమరీ  ఎడ్యుకేషన్ ప్రటిష్టంగా ఉండాలి .- ప్రధానోపాధ్యాయులు  గుడిబోయిన మాధవరావు . 

ప్రీ ప్రైమరీ  ఎడ్యుకేషన్ ప్రటిష్టంగా ఉండాలి .- ప్రధానోపాధ్యాయులు  గుడిబోయిన మాధవరావు . 

విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా :  మహబూబాబాద్ మండలం  రేగడి తండా గ్రామపంచాయతీ   శివారు చీమల తండా ఎం.పీ.పీ.ఎస్  ప్రైమరీ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్  డే సంబరాలు జరిగాయి .ఈ కార్యక్రమంలో   రేగడి తండా గ్రామపంచాయతీ శివారు  చీమల తండా  లో  గ్రామసర్పంచ్ హరిలాల్ ,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుడిబోయిన మాధవరావు  లు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ  విద్యార్థులకు ,ప్రీ ,  ప్రైమరీ ,ఎడ్యుకేషన్ చాలా పటిష్టంగా ఉండాలని విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆశయాలు రూపుదిద్దుకునే సమయమని ఈ ప్రైమరీ స్థాయిలోనే విద్యార్థులను సక్రమమైన మార్గంలో నడిపిస్తే భవిష్యత్తు తరాలకు మేధాశక్తి గల విద్యార్థులు అందించవచ్చని , అంతేకాకుండా  కార్యక్రమం ద్వారా విద్యార్థులు మానసిక ఉల్లాసాన్ని పొందారని  గ్రాడ్యుయేషన్ నిర్వాణ చేయడం చాలా ఆనందంగా ఉంది అని గుర్తు చేశారు . ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రధానోపాధ్యాయుల్ని  , పాఠశాల అధ్యాపక బృందాన్ని   స్థానిక సర్పంచ్  అభినందించారు . ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శివకుమారి ,  గ్రామ కార్యదర్శి రవి , విద్యార్థిని , విద్యార్థులు ,  విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు  పాల్గొన్నారు .

.,,,,,,,,,,,

Read More ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎంపీ  కడియం కావ్య 

 

Tags: