హిందూ సమ్మేళనం సన్నాహక సమావేశం

హిందూ సమ్మేళనం సన్నాహక సమావేశం

విశ్వంభర, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో మే 4న నిర్వహించే హిందూ సమ్మేళనం విజయవంతం కోసం మండల కమిటీ ఆధ్వర్యంలో చిన్ననాగారం శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో గురువారం మండల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం సభ ప్రతినిధులు తిరునహరి కృష్ణమాచార్యులు, కాలేరు నేతాజీ, గాయపు జయపాల్ రెడ్డి, పింగిలి శ్రీనివాస్, విద్యాపురం నాగేశ్వరరావు,బైరు అశోక్ గౌడ్ మిత్తింటి బాలక్రిష్ణ,డా.వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో హిందూ సమ్మేళనం నిర్వహించడం తో మరింత చైతన్యం వెల్లి విరుస్తుందని,దీంతో హిందువుల ఐక్యతకు దోహదమవుతుందని,హిందువులు అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావాలని  పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య,జొన్నలగడ్డ అశోక్ రెడ్డి, పంజాల వాసుదేవ గౌడ్, మాదాటి శంకర్ గౌడ్, బైరు శ్రీనివాస్ గౌడ్, పోలోజు సుధాకరా చారి,  బైరు పటేల్ రవి గౌడ్, బైరు శ్రీనివాస్ గౌడ్, దేవరాజు గౌడ్, చెడుపాక వెంకన్న, మాదాటి రామ్మూర్తి, మాదాటి శంకర్ గౌడ్, బైరు సుధాకర్ గౌడ్, మురళి, మునిగంటి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: