24న శ్రీసత్యసాయిబాబా ఆరాధన మహోత్సవం 

24న శ్రీసత్యసాయిబాబా ఆరాధన మహోత్సవం 

  • సేవా సమితి కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ 

విశ్వంభర, మహబూబాబాద్:  కురవి మండల కేంద్రంలో  శ్రీ సత్యసాయి సేవాసమితి కురవి శాఖ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 15వ ఆరాధన మహోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీసత్యసాయి సేవాసమితి కురవి కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్  తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కురవి మండలకేంద్రంలోని బాబా వారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ,  అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు పులిహోర, మజ్జిగసేవ శ్రీసత్యసాయి సేవాసమితి బాధ్యుల ఆద్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు .  అనంతరం ఈ  ఆరాధన మహోత్సవం శ్రీ సత్యసాయి బాబా వారి కురవి మందిరం ప్రశాంతి నిలయం వ్యవస్థాపక అధ్యక్షులు గండేపల్లి తిరుమలరావు-లక్ష్మీ దంపతుల పర్యవేక్షణలో  నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సేవాసమితి అన్ని విభాగాల బాద్యులు, సభ్యులు పాల్గొంటారని తెలిపారు. కురవి మండల వ్యాప్తంగా ఉన్న భగవాన్ భక్తులందరూ ఈ  ఆరాధనోత్సవాలకు హాజరై కార్యక్రమమును విజయవంతం చేయాలని,  భక్తులు అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరారు.

Tags: