ఇంటర్లో మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులకు సన్మానం
On
విశ్వంభర, సూర్యాపేట: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఇమాంపేట లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఇమాంపేట గ్రామ సర్పంచ్ నరిగే నాగేశ్వరి నాగరాజు హాజరైనారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2025- 2026 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఎం పి సి లో శ్రీజ, మొదటి సంవత్సరం ఎం. శ్రీజ మంచి మార్కులు సాధించినదుకు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కళాశాల ప్రిన్సిపాల్ పద్మ సర్పంచ్ నరిగే నాగేశ్వరి నాగరాజు ఉపాధ్యాయులు, పాఠశాల పిల్లల తల్లిదండ్రులు సన్మానించారు.



