మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే .

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే .

విశ్వంభర, మహబూబాబాద్ :- జిల్లా కేంద్రంలో పత్తిపాక  బజార్ కి చెందిన 20వ వార్డు  మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి జగన్ తల్లి  ఎల్లమ్మ  వారం రోజుల క్రితం  అనారోగ్యంతో మృతి చెందింది . విషయం తెలుసుకున్న   మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ , ఎమ్మెల్యే సతీమణి డిసిసి అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమా మురళి నాయక్ లు మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ  సభ్యులను  ఓదార్చా రు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మృతురాలి కుటుంబానికి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు . ఎమ్మెల్యే వెంట  కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,  కార్యకర్తలు , వార్డు ప్రజలు ఉన్నారు .

Tags: