వాగ్దేవిలో పిల్లలకు ఆశీర్వాదం.
- విజ్ఞాన్ హైస్కూల్ లోపాదపూజ..
.విశ్వంభర, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో పేరెంట్స్ తో పిల్లలకు ఆశీర్వాద కార్యక్రమం, విజ్ఞాన్ హై స్కూల్ లో తల్లిదండ్రులకు పిల్లలతో పాదపూజ కార్యక్రమాలు గురువారం ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఘనంగా నిర్వహించాయి. సంబంధిత కార్యక్రమాలకు పేరెంట్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ మాట్లాడుతూ..జీవితంలో పిల్లలకు తల్లిదండ్రులు గురువుల ఆశీస్సులు ఇవ్వడం గొప్ప సాంప్రదాయం అన్నారు. తమ పాఠశాల లోని విద్యా బోధన,పిల్లల ప్రతిభ,భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ, కవిత,మానస, మాధవి,రఘు,ఉమ,సలీం,సబియ, టీచర్స్ శిరీష అప్సర నవ్య సాహిని రజిని సులోచన తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు కనిపించే ప్రత్యక్ష దైవాలని వారి పాదపూజతో పిల్లలలో భక్తి భావం,సంస్కార వృద్ధి,గౌరవం పెంపొందిస్తాయని విజ్ఞాన్ హై స్కూల్ హెచ్ఎం గంజి అర్చన రెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు.అందుకే తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. పాదపూజతో పేరెంట్స్ భావోద్వేగాలకు లోనై పిల్లలను మనసారా ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీచర్స్ చంద్రమోహన్, భాస్కరాచారి, తోట అనిత,సుజాత,రమాదేవి, అనూష ,ఉడుత శ్వేత,రమ్య పేరెంట్స్ పాల్గొన్నారు.



