నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వీరేశం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామానికి చెందిన సిలివేరు సత్తయ్య కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఎమ్మెల్యే వీరేశం ఆశీర్వదించారు. అలాగే రామన్నపేట మండలం, లక్ష్మాపురం గ్రామానికి చెందిన బత్తుల కృష్ణ కుమార్తె వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.



