భగీరథ మహర్షి జయంతి
On
విశ్వంభర, మహబూబాబాద్: గురువారం తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ అనుమతితో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆద్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్ కుమార్ ముఖ్య అతిదిగా పాల్గొని భగీరథ మహార్షి జయంతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భగీరథ మహార్షి మహా జ్ఞాని ,ధీక్షకు ,సహనానికి ప్రతిరూపం అని ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా అనుకున్నది సాధించేవారని కొనియాడారు. ఈ కార్యక్రమములో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి బి. శ్రీనివాసరావు, వసతి గృహ సంక్షేమ అధికారులు,జిల్లా అధికారులు, ఐ డి ఓ సి కార్యాలయ సిబ్బంది, కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



