వరల్డ్ డ్యాన్స్ డే పోస్టర్ ఆవిష్కరణ

వరల్డ్ డ్యాన్స్ డే పోస్టర్ ఆవిష్కరణ

విశ్వంభర, రవీంద్ర భారతి : ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాల పోస్టర్‌ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో ఏప్రిల్ 28న ప్రజాపాటకు నృత్య నీరాజనం, ఏప్రిల్ 29న ప్రపంచ నృత్య దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కన్వీనర్ సుజావతి మాట్లాడుతూ కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, ఆంధ్రనాట్యం వంటి నృత్య రూపకాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 28న 25 మంది నృత్య గురువులు, 200 మంది కళాకారులు, 29న 40 మంది గురువులు, 500 మంది పిల్లలు పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని వెల్లడించారు. ముఖ్య అతిథులుగా సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ, నృత్య గురువు పద్మజా రెడ్డి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో మాడభూషీ రమణి సిద్ధి, ఇందిరా పరాశరం, ఎన్. సోమయ్య, మహేష్ దుర్గే తదితరులు పాల్గొన్నారు

Tags: