దిల్ సుఖ్ నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా 

దిల్ సుఖ్ నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా 

  • సంఘీభావం తెలిపిన తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ 

విశ్వంభర, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతున్న నేపధ్యంలో సమ్మెకు సంఘీభావంగా దిల్ సుఖ్ నగర్ డిపో ముందు  ధర్నా కు టిజె ఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు , తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ  మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఎనిమిది వేల ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ విలీనం, పీఆర్సీ, పే స్కేల్, యూనియన్ ల ఏర్పాటు వంటి విషయాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకొని సమస్యలను పరిష్కరించాలని అన్నారు.  ఆర్టీసీ కోసం మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను అమలు చేయాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో ప్రెసిడెంట్ బి సైదాచారి, డిపో కార్యదర్శి , రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అరుణ, డిపో జేఏసీ ముఖ్య  నాయకులు వెంకటయ్య , నిరంజన్ , ఐ వి కె  రెడ్డి, మోహన్ , తెలంగాణ శంకర్, కే ఎన్ రెడ్డి , జె పి రెడ్డి , శేఖరు, కరుణాకరు, ఎండి జాంగిర్, ఎండి హర్షద్ , రాజు, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags: