పహల్గాం లాంటి సంఘటనలు ఐక్యతకు దెబ్బతీస్తున్నాయి 

పహల్గాం లాంటి సంఘటనలు ఐక్యతకు దెబ్బతీస్తున్నాయి 

విశ్వంభర, చత్రినాక : పహాల్గామ్ ఉగ్ర దాడికి నేటితో సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాతబస్తీలోని చంద్రాయణ గుట్ట నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బోయ నాగేష్ ఆధ్వర్యంలో ఛత్రినాక చౌరస్తా వద్ద పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రాయణ గుట్ట నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బోయ నగేష్ మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే రోజున భారతదేశంలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయే విధంగా పాకిస్తాన్ వాదులు దేశంలోకి చొరబాటు దారులు గా వచ్చి అమాయకమైన ప్రజలను తీవ్రంగా అతి క్రూరంగా చంపడం జరిగింది అన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన చొ రబాటు ఉగ్రవాదులకు భారతదేశంలో విభిన్న పార్టీల మతాలు, కులాలు సంపన్న వర్గాలతో కూడుకున్న దేశం అని అన్నారు. భారత సైనికుల మీద అమాయక ప్రజల మీద ఇలాంటి దాడులు మళ్లీ జరిగితే పాకిస్తాన్ కి ఉగ్రరూపం చూపించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: