అంత్యోదయ ఫలాలను నిరుద్యోగులు సద్వినం చేసుకోండి
విశ్వంబర, మిర్యాలగూడ : నరేంద్ర మోదీ పాలనలో యువత ఆర్థికంగా స్వావలంబన చెందాలనే దృక్పధంతో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పథకం ద్వారా గ్రామీణ, పట్టణ విద్యార్థిని విద్యార్థులకు విసీడమ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా 3 నెలల ఉచిత నర్సు, డేటా ఎంట్రీ, స్పోకెన్ ఇంగ్లీష్, స్కిల్ డెవలప్మెంట్ వంటి కోర్సులను హాస్టల్ సదుపాయంతో సుధా బ్యాంకుపై గల శిక్షణ సంస్థలో నేర్పించడం జరుగుతుంది. ఈ సందర్బంగా పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ వెలుగు ఇందిరా నాగరాజు, మాజీ కౌన్సిలర్ చిలుకూరి రమాదేవిశ్యామ్,బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి చిల్లంచర్ల అభి చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు బుధవారం రోజున వెల్కమ్ కిట్లను అందించడం జరిగింది.ఈ సందర్బంగా చిలుకూరి శ్యామ్ మాట్లాడుతూ, దేశ ప్రధాని మోదీ అంత్యోదయ ఫలాలను, నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ద్వారా వారు అభివృద్ధి చెంది వారి కుటుంబాలకు ఆసరాగా ఉండాలనే లక్ష్యంతో ఈ పథకాలను ప్రవేశపెట్టారని వీటిని అందరు వినియోగించుకోవాలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు మేడి నవీన్, సంస్థ నిర్వాహకులు సైదా చారీ, రేణుక, వరుణ్, పూజ, సునీత, స్వర్ణలత, సుధా లు పాల్గొన్నారు.



