చదువుతోనే గొప్ప స్థాయికి చేరుకోవాలని
- సంక్షేమ వారోత్సవాలు: పేరెంట్స్ మీటింగ్‌లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
విశ్వంభర, మహబూబాబాద్: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నరసింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పేరెంట్స్, టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదేనని, చదువుతో పాటు క్రీడలు, నైతిక విలువలు కూడా నేర్పించాలని కోరారు.ఏ స్కూల్ లో వున్నా సౌకర్యలను, విద్య బోధను ను చూసి, ప్రైవేట్ స్కూల్ లో చదివే విద్యార్థులను ఈ స్కూల్ లో జాయిన్ చేయటం చాలా శుభపరిణామనీ, ఆదర్శభావాలతో పిల్లలను పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు, ప్రస్తుతం విద్యా సంస్థలలో అనేక సౌకర్యాలు, యోగ మెడిటేషన్, ఇండస్ట్రియల్ టూల్స్ తదితర కార్యక్రమాలు ఉన్నాయని అన్ని వినియోగించుకుని విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటు ఇతర సామాజిక అంశాల్లో నైపుణ్యత చూపించాలన్నారు, ఇంత చిన్న పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహించడం బాగుందని అన్నారు, ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించి మెమోంట్ లను అంతచేసినారు, స్కూల్ లో స్టూడెంట్స్ విజ్ఞానం నిమిత్తం ఏర్పాటు చేసిన లైబ్రరీ నీ సందర్చినారు, లైబ్రరీలోని వివిధ సబ్జెక్టుల సామాజిక అంశాల సంఘసంస్కర్తల రచనలు బుక్కులు ఉంటాయని వాటి ద్వారా పిల్లల మేధస్సు పెంచడం కోసం ఉపయోగించాలని తెలిపారు. పీఎం శ్రీ పథకంలో ఉన్న ఈ పాఠశాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యాసంస్కరణల పక్కాగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థినీ విద్యార్థులకు చక్కటి విద్యతోపాటు ఉన్నత విలువలు తో కూడిన విద్యను అందిస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులను ఆమె అభినందించారు. అనంతరం కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, వంట గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన విద్యార్థుల ఫోటో గ్యాలరీని పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, ఎంఈఓ, ఎంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



